: సదావర్తి భూములను ఎమ్మెల్యే ఆళ్ల సొంతంగా కొనాలి... బినామీ పేర్లతో కొంటే ఐటీకి ఫిర్యాదు చేస్తాం!: నారా లోకేష్ వార్నింగ్


హైకోర్టు తీర్పు మేరకు సదావర్తి భూములను వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రూ. 5 కోట్లు అదనంగా చెల్లించి కొనుగోలు చేయాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ మొత్తాన్ని సొంతంగా కొనుగోలు చేయాలని... బినామీ పేర్లతో కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే ఐటీ అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. భూములను వేలం వేస్తున్నప్పుడు సైలెంట్ గా ఉన్న ఆళ్ల... ఆ తర్వాత కోర్టుకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. ఎంతసేపూ ప్రభుత్వంపై ఏదో ఒక రకంగా బురద చల్లుదామనే పనిలోనే వైసీపీ నేతలు ఉన్నారని ఆయన మండిపడ్డారు. 

  • Loading...

More Telugu News