: తన ఫేవరేట్ హీరోతో ఏడుస్తూ సెల్ఫీ దిగిన అభిమాని.. మీరూ చూడండి!
ఇన్నాళ్లకి తన అభిమాన హీరోని ప్రత్యక్షంగా కళ్లారా చూశానన్న ఆనందంలో ఓ అభిమాని కన్నీరు పెట్టుకున్నాడు. తనలాంటి వారిని ఎంతో మందిని తోసుకుంటూ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ వద్దకు వచ్చిన ఆ అభిమాని చివరకు ఆయనతో సెల్ఫీ దిగాడు. ఏడుస్తూనే ఆ అభిమాని ఇలా సెల్ఫీ దిగడంతో ఇప్పుడు ఆ ఫొటో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. షారుఖ్ ఖాన్ నటిస్తున్న ‘జబ్ హ్యారీ మెట్ సెజల్’ సినిమా పబ్లిసిటీలో భాగంగా ఇటీవల షారుక్ ఖాన్ అనుష్క శర్మతో కలిసి వచ్చి ముంబయిలో సందడి చేశాడు. ఈ సమయంలో ఓ అభిమాని ఇలా ప్రవర్తించాడు. తనను గమనించి షారుక్ ఖాన్ దగ్గరికి తీసుకున్నాడని ఆ అభిమాని పొంగిపోయాడు.