: ఏంచేస్తాం... మన ప్రధాని బలహీనుడు!: రాహుల్ గాంధీ


గత కొన్ని రోజులుగా మీడియా ముందుకు రాని కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టి వార్తల్లోకి ఎక్కారు. కాశ్మీర్ విషయంలో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, ఇండియాకు బలహీనమైన ప్రధాని ఉన్నారని వ్యాఖ్యానించారు. గత నెల 26వ తేదీన హిజబుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తున్న వేళ, 'భారత పాలిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం' అని యూఎస్ సంబోధించడాన్ని నరేంద్ర మోదీ సర్కారు ఒప్పుకుందని ఆయన ఆరోపించారు. భారత్ లో అంతర్భాగమైన ప్రాంతాన్ని భారత పాలిత ప్రాంతమని ఎలా చెబుతారని, అలా చెప్పిన అమెరికా వ్యాఖ్యను ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. కాగా, సలాహుద్దీన్ ను ఉగ్రవాదని చెబుతున్న వేళ, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావిస్తూ, అమెరికా ఆ పదాన్ని వాడి ఉండవచ్చని విదేశీ వ్యవహారాల శాఖ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News