: కరీంనగర్‌లో సందడి చేసిన సమంత, అక్కినేని అఖిల్!
కరీంనగర్‌లో సినీనటులు సమంత, అక్కినేని అఖిల్ ఈ రోజు సందడి చేశారు. నిన్న సమంత, అఖిల్ ‘కరీంనగర్‌లో కలుద్దాం’ అంటూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు వారిద్దరూ ఆ జిల్లాలోని ఉస్మాన్‌పురలో ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని అఖిల్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. తన వదినతో కలిసి ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో పాల్గొనడం పట్ల గర్వంగా ఉందని తెలిపాడు. అఖిల్ ట్వీట్ కు స్పందించిన సమంత.. ‘అఖిల్ నా రాక్ స్టార్’ అంటూ కామెంట్ చేసింది. సమంత, అఖిల్‌లను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరు సెలబ్రిటీలు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నారు. కొన్ని నెలల్లోనే అక్కినేని నాగచైతన్యను సమంత పెళ్లాడనున్న విషయం తెలిసిందే.