: భయంతో బురఖా వేసుకుని తిరుగుతున్న ప్రభుత్వ ఉద్యోగి... ధైర్యం చెప్పి పంపిన రైల్వే పోలీసులు!
ఇటీవలి కాలంలో ముస్లింలపై దాడులు పెరిగిన వేళ, భయపడిన ఓ ప్రభుత్వ ఉద్యోగి నిత్యమూ బురఖా వేసుకుని ప్రయాణాలు చేస్తూ, రైల్వే పోలీసులకు పట్టుబడిన ఘటన ఇది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్ కు చెందిన నజ్ముల్ అనే వ్యక్తి, అలీగఢ్ సమీపంలోని కసింపూర్ పవర్ స్టేషన్ లో అసిస్టెంట్ ఇంజనీర్. రోజూ రైల్లో ప్రయాణించి ఆఫీసుకు చేరుకుంటుంటాడు. ఇటీవల ఓ వ్యక్తితో స్టేషన్ లో గొడవ పడ్డాడు.
ఆపై రైల్లో జునైద్ అనే బాలుడిని కొందరు కొట్టి చంపిన ఘటన గురించి తెలుసుకుని, తాను కూడా ముస్లింను కాబట్టి, తనపైన కూడా దాడి చేస్తారేమోనని భయపడి, బురఖా వేసుకుని ప్రయాణాలు చేస్తున్నాడు. రోజులాగానే నిన్న కూడా అదే వేషంలో రైల్వే స్టేషన్ కు వెళ్లగా, అతని నడకతీరును చూసి అనుమానించిన రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి విషయం, తన మనసులోని భయాన్ని నజ్ముల్ వెల్లడించడం, అతని వద్ద అనుమానాస్పద వస్తువులేమీ లభ్యం కాకపోవడంతో, 'దాడులేమీ జరగవులే' అంటూ ధైర్యం చెప్పి, అతన్ని పంపించి వేశారు.