: మ్యాచ్ ఫినిషర్ బాధ్యతలు మోసేందుకు సిద్ధం: హార్దిక్ పాండ్య
మ్యాచ్ ఫినిషర్ బాధ్యతలు తలకెత్తుకునేందుకు టీమిండియా యువ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య సంసిద్ధత వ్యక్తం చేశాడు. టీమిండియాలో సమర్థుడైన ఆల్ రౌండర్ గా ఎదిగే ప్రయత్నంలో కొంత పురోగతి సాధించిన హార్దిక్ పాండ్య మాట్లాడుతూ, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తో పాటు, వెస్టిండీస్ టూర్ లో మూడో వన్డే ఓటమి మంచి పాఠాలు నేర్పిందని అన్నాడు. ఈ రెండు మ్యాచ్ లలో పాండ్య రాణించినప్పటికీ ఫలితం ప్రతికూలంగా వచ్చింది. తాను రాణించినప్పటికీ మ్యాచ్ కు విజయవంతమైన ఫినిషింగ్ ఇవ్వలేకపోతున్నానని, ఆ బలహీనతను అధిగమించి, భవిష్యత్ లో మంచి ముగింపు ఇస్తానని పాండ్య తెలిపాడు. కాగా, పాండ్య వన్డే, టీ20 జట్లలో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.