: సెన్సార్ కంటే ముందు మాకు చూపించాలి: `ఇందు స‌ర్కార్‌` సినిమాపై పహ్లాజ్ నిహ్లానీకి కాంగ్రెస్ నేత లేఖ‌


1975-77 నాటి అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల నేప‌థ్యంలో మాధుర్ భండార్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `ఇందు స‌ర్కార్‌` సినిమాపై కాంగ్రెస్ నాయ‌కుడు సంజ‌య్ నిరుప‌మ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. త‌మ నాయ‌కులు ఇందిరా గాంధీ, సంజ‌య్ గాంధీల చుట్టూ తిరిగే ఈ సినిమా క‌థ‌లో వారిని అగౌరవనీయ రీతిలో చూపించే అవ‌కాశం ఉంద‌ని, అందుకే సెన్సార్ చేయ‌క‌ముందే త‌మ‌కు ఒక‌సారి చూపించాల‌ని సెన్సార్ బోర్డ్ చైర్మ‌న్ ప‌హ్లాజ్ నిహ్లానీకి ఆయ‌న లేఖ రాశారు.

జూలై 28న విడుద‌లకు సిద్ధ‌మైన ఈ సినిమాలో ఇందిరా గాంధీగా సుప్రియా వినోద్‌, సంజ‌య్ గాంధీగా నీల్ నితిన్ ముఖేశ్‌లు నటించారు. ఎమ‌ర్జెన్సీ స‌మ‌యంలో జ‌రిగిన అక్ర‌మాలు, రాజ‌కీయ కుట్ర‌లు, వాటి ప‌ర్య‌వ‌సానాల‌ను ఈ సినిమాలో చూపించ‌నున్నారు. కాంగ్రెస్ నేత లేఖ‌పై చిత్ర ద‌ర్శ‌కుడు మాధుర్ భండార్క‌ర్ స్పందిస్తూ - `సెన్సార్ కంటే ముందు ఇత‌రుల‌కు ప్ర‌ద‌ర్శించే ప్ర‌స‌క్తే లేదు. సినిమా విడుద‌ల‌కు ముందు ఇలాంటి వివాదాలు రోజుకొక‌టి వ‌స్తుంటాయి` అన్నారు.

  • Loading...

More Telugu News