: అభివృద్ధికి నా భర్తే అడ్డు... చంపాలని కూడా చూస్తున్నాడని తేలప్రోలు సర్పంచ్ హరిణి ఫిర్యాదు


పంచాయితీ పనుల్లో అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న తన భర్త, తనను చంపాలని కూడా చూస్తున్నాడని కృష్ణా జిల్లా తేలప్రోలు సర్పంచ్ హరిణి కుమారి పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. గన్నవరం పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆమె, నిన్న సాయంత్రం తాను గుడికి వెళితే, ఇద్దరు కిరాయి రౌడీలతో తనపై దాడి చేయించారని, అర్ధరాత్రి స్టేషన్ కు వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పంచాయితీ విషయాల్లో భర్త జోక్యం పెరిగిపోయిందని ఆరోపించారు. పలు పనుల్లో అవినీతికి పాల్పడ్డాడని, తనను ఆడపిల్ల మాదిరిగా ఇంట్లోనే ఉండాలని, పంచాయితీ పనులన్నీ తానే చక్కబెడతానని బెదిరిస్తున్నాడని అన్నారు. పిల్లల్ని చూసుకుంటే చాలని చెబుతున్నాడని, తన భర్తే అయినా ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోబోనని హెచ్చరించారు. కాగా, తన భార్యకు మానసిక స్థితి సరిగ్గా లేదని హరిణి భర్త వాదిస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News