: త్వ‌ర‌లో ట్రంప్‌ - పుతిన్‌ల మొద‌టి స‌మావేశం


అమెరికా అధ్య‌క్షునిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన త‌ర్వాత మొద‌టిసారి ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్ర‌త్య‌క్షంగా క‌ల‌వ‌నున్నారు. శుక్రవారం హాంబ‌ర్గ్‌లో జ‌రగ‌నున్న జీ20 స‌మావేశాల స‌మ‌యంలో ట్రంప్ - పుతిన్‌లు స‌మావేశం కానున్నట్లు వారి వ్య‌క్తిగ‌త స‌ల‌హాదారులు స్ప‌ష్టం చేశారు. ఈ భేటీలో సిరియా, ఉక్రెయిన్ దేశాల వివాదాలతో పాటు ఇత‌ర ద్వైపాక్షిక ఒప్పందాల గురించి కూడా ట్రంప్ చ‌ర్చించ‌నున్న‌ట్లు అమెరికా నేష‌న‌ల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్ర‌తినిధి మైఖేల్ ఆంట‌న్ తెలిపారు. ఇంత‌కుముందు మూడు సార్లు వీరివురు ఫోన్లో చ‌ర్చించుకున్నా ప్ర‌త్య‌క్షంగా క‌లుసుకోవ‌డం మాత్రం ఇదే మొద‌టిసారి అవుతుంది. 2016 అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల స‌మ‌యంలో యూఎస్‌-ర‌ష్యా సంబంధాలు మెరుగుప‌డాల‌ని ట్రంప్ ప్ర‌సం‌గించ‌డం, ప్ర‌చారంలో భాగంగా పుతిన్‌ను చాలా సార్లు పొగడడం తెలిసిందే.

  • Loading...

More Telugu News