: జూలై 10 నుంచి మ‌ల‌బార్ వార్ గేమ్స్‌.. మూడు దేశాల నావికాదళ ప్రదర్శన !


మ‌లబార్‌ వార్ గేమ్స్ వేదిక‌గా జూలై 10 నుంచి భార‌త్‌, జ‌పాన్‌, అమెరికా దేశాలు క‌లిసి త‌మ త‌మ నావికా ద‌ళ శ‌క్తియుక్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నాయి. `యాక్ట్ ఈస్ట్ పాల‌సీ`లో భాగంగా మూడు దేశాల మ‌ధ్య భ‌ద్ర‌త‌ప‌ర‌ సంబంధాలు పెంచుకోవ‌డానికి నిర్వ‌హిస్తున్న ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో ఆయా దేశాల‌కు చెందిన అత్యుత్త‌మ యుద్ధ‌నౌక‌లు పాల్గొన‌నున్నాయి.

మ‌రోప‌క్క ఈ మ‌ధ్య‌ చైనా, భార‌త్‌ల మ‌ధ్య పెరుగుతున్న స‌రిహ‌ద్దు గొడ‌వ‌ల నేప‌థ్యం కూడా ఈ వార్‌గేమ్స్ నిర్వ‌హ‌ణ‌కు ప‌రోక్ష కార‌ణమ‌ని నిఘా వ‌ర్గాల అభిప్రాయం. భార‌త్‌కు చెందిన ఐఎన్ఎస్ విక్ర‌మాదిత్య‌, అమెరికాకు చెందిన యూఎస్ఎస్ నిమిజ్‌, అలాగే జ‌పాన్ కు చెందిన అతిపెద్ద యుద్ధ హెలికాప్ట‌ర్ క్యారియ‌ర్ జేఎస్ ఇజుమోలతో పాటు అన్ని ర‌కాల యుద్ధ నౌక‌లు, స‌బ్‌మెరైన్ల‌ను ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. వార్‌గేమ్స్ ద్వారా ఇండో-ఆసియా ప‌సిఫిక్ ప్రాంత దేశాల మ‌ధ్య సముద్రతీర ప్రాంత ర‌క్ష‌ణ సంబంధాలు బ‌ల‌ప‌డ‌నున్నాయి.

  • Loading...

More Telugu News