: అమెరికాలో తమ్మారెడ్డి భరద్వాజ మనవడు దుర్మరణం.. అక్కడే అంత్యక్రియలు!
ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఇంట్లో విషాదం నెలకొంది. భరద్వాజ మనవడు సాకేత్ రామ్ వెల్లంకి (19) నిన్న అమెరికాలో మృతి చెందాడు. తమ్మారెడ్డి కుమార్తె కుమారుడు సాకేత్. సాకేత్ మృతికి కారణాలు తెలియరాలేదు. అతని అంత్యక్రియలు ఈ రోజు అమెరికాలోని వర్జీనియాలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగువారు హాజరుకానున్నట్టు తెలుస్తోంది.