: వెస్టిండీస్ టీమ్ మొత్తం దిగింది... భారత్ తో పోరుకు సిద్ధమైన క్రిస్ గేల్, పొలార్డ్, బద్రి, నరేన్


కీలకమైన ఆటగాళ్లను పక్కనబెట్టి, భారత్ తో వన్డే సిరీస్ కు ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేసిందని విమర్శలు తెచ్చుకున్న విండీస్ క్రికెట్ బోర్డు,. ఏకైక టీ-20కి మాత్రం పూర్థి స్థాయి టీమ్ ను సిద్ధం చేసింది. గత సంవత్సరం ఏప్రిల్ లో చివరి అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఆడి, ఆపై పొట్టి క్రికెట్ లో సత్తా చాటి, ఓ సీజన్ లో 1000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించిన క్రిస్ గేల్ కు పిలుపు అందింది. ఇండియాతో మ్యాచ్ కోసం గేల్ ను విండీస్ బోర్డు ఎంపిక చేసింది. ఆదివారం సబీనా పార్కులో జరిగే టీ-20కి గేల్ తో పాటు పొలార్డ్, సునీల్ నరైన్, శామ్యూల్ బద్రిలను కూడా జట్టులోకి దింపడంతో, ఈ పోరు ఆసక్తికరం కానుంది.

విండీస్ జట్టు: కార్లోస్ బ్రాత్‌ వైట్ (కెప్టెన్‌), శామ్యూల్ బద్రీ, బీటన్, క్రిస్ గేల్, ఎవిన్ లెవిస్, జాసన్ మొహమ్మద్, సునీల్ నరేన్‌, కీరన్ పొలార్డ్, పావెల్, మార్లోన్ శామ్యూల్స్, జెరోమ్ టేలర్, చాడ్విక్ వాల్టన్ (వికెట్‌ కీపర్‌), కేస్క్ విలియమ్స్.

  • Loading...

More Telugu News