: ఈ ఫోటోలోని నటి ఎవరో పోల్చండి... చూద్దాం!
అప్పుడప్పుడు సినీ నటులు తమ పాత ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులకు పరీక్ష పెడుతుంటారు. బాలీవుడ్ లో ప్రతిభావంతురాలైన నటిగా పేరుతెచ్చుకున్న విద్యాబాలన్ కూడా తన ఇన్ స్టా గ్రాం ఖాతాలో తాజాగా ఒక ఫోటో పోస్టు చేసింది. తెల్లటి మీసం, గుబురుగడ్డంతో ఉన్న ఆ ఫోటోను గుర్తు పట్టడం ఎవరికైనా కష్టమే. అయితే తాను స్టేజ్ షోలు వేసే రోజుల నాటి ఫోటో ఇది అని చెబుతూ, ఆ స్టేజ్ షో పేరును కూడా పేర్కొంది. ఈ ఫోటో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ ఫోటోలో విద్యాబాలన్ ను గుర్తుపట్టడం కష్టంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.