: ఒకే ప్లాట్ ను 205 మందికి అమ్మిన కిలాడీ లేడీ!
ఈమె మామూలు కిలాడీ కాదు. ఒకే ప్లాట్ ను ఏకంగా 205 మందికి అమ్మి, వారి నుంచి రూ. 6.8 కోట్లను వసూలు చేసింది. ఈ ఘటన అహ్మదాబాద్ లో చోటు చేసుకుంది. ఈ కిలాడీ పేరు సీమా కపూర్. ఆర్మీ కల్నల్ రమణ్ కపూర్ భార్య. అన్నిటికన్నా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఒకే స్థలాన్ని 205 మందికి అమ్మి, రిజిస్ట్రేషన్ చేయించినా... ఇంతవరకు ఒక్కరికి కూడా ఆ ప్లాట్ ను చూపించలేదు. మోసపోయామని గ్రహించిన బాధితులు చివరకు పోలీసులను ఆశ్రయించారు. దీంతో, పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు.