: సిద్ధిపేట జిల్లాలో దారుణ హత్య


సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్ద చెప్యాల గ్రామంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన గడిల మధుసూదన్ (48) అనే వ్యక్తిని నరికి చంపారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తును ప్రారంభించారు. హత్యకు పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

  • Loading...

More Telugu News