: వాడరాని పదాలతో అమెరికన్లపై కిమ్ జాంగ్ తిట్ల దండకం!
నిన్న బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా, ఆ తరువాత అమెరికన్లపై విరుచుకుపడింది. 'స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమెరికన్ బాస్డర్డ్స్ కు ఇదే నా బహుమతి' అని కిమ్ జాంగ్ ఉన్ వ్యాఖ్యానించినట్టు ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. ఈ కానుక ఆ బాస్టర్డ్స్ కు అంతగా రుచించదని, వారు సంతోషించరని కూడా కిమ్ పేర్కొన్నట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజన్సీ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అప్పుడప్పుడూ ఇటువంటి కానుకలను పంపుతుంటే వారి విసుగు దూరమవుతుందని కిమ్ వ్యంగ్యంగా మాట్లాడినట్టు పేర్కొంది.
కాగా, ఈ క్షిపణిని ప్రయోగించిన తరువాత, భూ ఉపరితలానికి 2,802 కిలోమీటర్ల ఎత్తునకు చేరి, ఆ ఎత్తులోనే 933 కిలోమీటర్ల దూరాన్ని 39 నిమిషాల్లో చేరుకుని జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలికి సమీపంలోని సముద్రంలో కూలిన సంగతి తెలిసిందే. తాము ఈ క్షిపణితో అలస్కానైనా కొట్టగలమని, అమెరికాలోని అన్ని ప్రాంతాలనూ తమ క్షిపణులు చేరుకుంటాయని ఆ దేశం వ్యాఖ్యానించింది.