: వెనిజులాలో కూలిన జెట్ విమానం


వెనిజులాలోని ఓ ద్వీపంలో విమానం కూలింది. 9 మంది ప్రయాణికులు, పైలట్ తో బయలుదేరిన చిన్న జెట్ విమానం, సాంకేతికలోపంతో కుప్పకూలినట్టు తెలుస్తోంది. విమానంలో లోపాన్ని గమనించిన పైలట్ దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని భావించినప్పుడు ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదం నుంచి ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.

గల్ఫ్ స్ట్రీమ్ 3 రకానికి చెందిన ఈ విమానాన్ని ప్రజా ప్రతినిధులను రవాణా చేసేందుకు వెనిజులా ప్రభుత్వ ఏజన్సీ నిర్వహిస్తోంది. మార్గరిటా ఐలాండ్ నుంచి బయలుదేరిన ఈ విమానం 1:45 గంటలకు రాడార్ల నుంచి అదృశ్యమైందని వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి నెస్టర్ రివెరోల్ వెల్లడించారు. సముద్ర తీరానికి 75 కిలోమీటర్ల దూరంలో కూలిపోయి ఉండవచ్చని తెలిపారు. 100 మంది సైనికులు, విమానాలతో గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.

  • Loading...

More Telugu News