: 'అనంత' హత్యల కేసు: భార్య, కుమార్తెలను సుత్తితో కొట్టి చంపిన వ్యక్తి ఆత్మహత్య


అనంతపురం జిల్లా తాడిపత్రిలోని కృష్ణాపురంలో భార్య, ఇద్దరు కుమార్తెలను అత్యంత పాశవికంగా సుత్తితో కొట్టి చంపాడంటూ బంధువులు ఆరోపిస్తున్న రామసుబ్బారెడ్డి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రామసుబ్బారెడ్డి తాడిపత్రి బస్టాండ్ లో అపస్మారకస్థితిలో పడి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు బస్టాండ్ కు చేరుకుని అతనిని ఆసుపత్రికి తరలించారు.

అయితే రామసుబ్బారెడ్డి మార్గ మధ్యంలో మృతిచెందారు. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని వైద్యులు తెలిపారు. కాగా, నిన్న రాత్రి భార్య సులోచన, కుమార్తెలు ప్రసన్న, ప్రతిభలను రామసుబ్బారెడ్డి సుత్తితో కొట్టి హతమార్చాడని కుటుంబ సభ్యులు, పోలీసులు అభిప్రాయపడ్డారు. కాగా, రామసుబ్బారెడ్డి, సులోచన దంపతుల పెద్ద కుమార్తె ప్రత్యూష తిరుపతిలో చదువుకుంటోంది. 

  • Loading...

More Telugu News