: నార్కట్ పల్లి హైవేపై దోపిడీ దొంగల స్వైర విహారం!
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి జాతీయ రహదారిపై దొపిడీ దొంగలు బరితెగించారు. నడి రోడ్డుపై వాహనాలను లక్ష్యం చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్నారు. ఈ రోజు హైవేపై వస్తున్న ఓ లారీని ఆపిన దుండగులు లారీ డ్రైవర్ పై దాడిచేసి, అతని నుంచి 15,000 రూపాయలు దోచుకున్నారు. దీంతో లారీ డ్రైవర్ దొపిడీ దొంగల గురించి పోలీసులకు సమాచారమందించాడు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వారు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.