: సినీ పరిశ్రమ బంద్ కు మద్దతు ప్రకటించిన రజనీకాంత్!
జీఎస్టీకి వ్యతిరేకంగా తమిళనాడు సినీ పరిశ్రమ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి నిరవధికంగా ధియేటర్లను బంద్ చేశారు. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అదనంగా విధించిన 30 శాతం స్థానిక పన్నును నిరసిస్తూ, దానిని తగ్గించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ దీనిపై స్పందించలేదంటూ పలువురు దర్శకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా ఆయన స్పందించారు. తన ట్విట్టర్ మాధ్యం ద్వారా ఆయన తమిళనాడు సినీ పరిశ్రమ బంద్ కు మద్దతిస్తున్నానని తెలిపారు. సినీ పరిశ్రమపై ఆధారపడి లక్షలాదిమంది ఉపాధి పొందుతున్నారని ఆయన తెలిపారు. అందుకే పన్ను మినహాయింపుపై తమిళనాడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆయన సూచించారు.