: స్నాప్‌డీల్ కొనుగోలుకు పావులు కదుపుతున్న ఫ్లిప్‌కార్ట్.. రూ.5,500 కోట్ల భారీ ఆఫర్.. తిరస్కరించిన స్నాప్‌డీల్!


ఈ-కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌ను సొంతం చేసుకోవాలనుకున్న దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఏకంగా రూ.5,500 కోట్లు ( 850 మిలియన్ డాలర్లు) ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను స్నాప్‌డీల్ తిరస్కరించినట్టు సమాచారం. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసిన సొమ్ము చాలా తక్కువని భావిస్తుండడం, ఆ సంస్థకు క్లీన్ ఇమేజ్ ఉండడం వల్లే ఈ డీల్‌కు నో చెప్పినట్టు చెబుతున్నారు. ‘‘మొదట ఈ ఆఫర్‌ను తిరస్కరించాం. ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి’’ అని స్నాప్‌డీల్ అధికారి ఒకరు తెలిపారు.

మరోవైపు ఈ విషయమై స్పందించేందుకు సాఫ్ట్ బ్యాంకు, ఫ్లిప్‌కార్ట్ నిరాకరించాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అతిపెద్ద ఇన్వెస్టర్ అయిన సాఫ్ట్‌బ్యాంక్ ఈ డీల్ గురించి గత కొన్ని నెలలుగా మధ్యవర్తిత్వం నడుపుతున్నట్టు సమాచారం. ఒకవేళ రెండు సంస్థల మధ్య చర్చలు సఫలమై స్నాప్‌డీల్ కనుక ఫ్లిప్‌కార్ట్ చేతికి చిక్కితే దేశీయ ఈ-కామర్స్ చరిత్రలో ఇదే అత్యంత భారీ డీల్‌గా నిలిచిపోతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News