: బాలీవుడ్ ‘శ్రీమంతుడు’ హృతిక్ రోషన్ కు మరోమారు కోర్టు సమన్లు!


తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలను కాపీకొట్టి ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని నిర్మించారంటూ రచయిత శరత్ చంద్ర కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా హిందీలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారంటూ శరత్ చంద్ర హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగింది.

అయితే, వివరణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాలని హృతిక్ రోషన్ కు గతంలో రెండు సార్లు సమన్లు జారీ చేయడం జరిగింది. దీనిపై హృతిక్ స్పందించకపోవడంతో, ఈరోజు మళ్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. కాగా, లిఖిత పూర్వక వాంగ్మూలం నమోదుకు హాజరుకావాలని శ్రీమంతుడు చిత్రం దర్శక, నిర్మాతలను కోర్టు పలుమార్లు ఆదేశించినప్పటికీ వారు స్పందించ లేదు. దీంతో, దర్శక, నిర్మాతలు తమ వాదనలు వినిపించే అవకాశాన్ని రద్దు చేస్తూ ఎక్స్ పార్టే ఉత్తర్వులను కోర్టు జారీ చేసింది.

  • Loading...

More Telugu News