: అస్సాంలో ఐఏఎఫ్ హెలికాప్టర్ అదృశ్యం!


పైలట్ సహా ముగ్గురు ప్రయాణికులతో కూడిన భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు చెందిన హెలికాప్టర్ అదృశ్యమైంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని సాగలే ప్రాంతంలో వరద బాధితులకు సహాయక చర్యలు అందించే నిమిత్తం అస్సాంలోని తేజ్‌పూర్ ఎయిర్‌బేస్ నుంచి ఓ హెలికాప్టర్ (ఏఎల్ హెచ్) ఈ రోజు సాయంత్రం 4 గంటలకు బయల్దేరి వెళ్లింది. అయితే, టేకాఫ్ అయిన కొద్ది సేపటికే హెలికాప్టర్‌తో సంబంధాలు తెగిపోయినట్టు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం హెలికాప్టర్ ఆచూకీ కనుక్కునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News