: కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడిస్తా.. దమ్ముంటే నల్గొండలో నన్ను ఓడించాలి!: ఎమ్మెల్యే కోమటిరెడ్డి సవాల్
‘కేసీఆర్ ను గజ్వేల్ లో ఓడిస్తా.. దమ్ముంటే నల్గొండలో నన్ను ఓడించాలి’ అంటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాము పదవులు వదులుకుని సోనియాను ఒప్పించి ప్రత్యేక రాష్ట్రం తెస్తే, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అక్రమ సంపాదనను రికవరీ చేస్తామని అన్నారు. జనవరిలో తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తెచ్చామో ప్రజలకు వివరిస్తానని చెప్పారు.