: చిన్న విషయానికే తన చెల్లిని చంపేసిన బాలుడు!


అమ్మమ్మ ఇంట్లో లేని సమయంలో అన్నాచెల్లెళ్లు గొడ‌వ‌ప‌డి, కొట్టుకున్నారు. చివ‌రికి ఆగ్ర‌హంతో ఊగిపోయిన అన్న త‌న చెల్లి మెడలో ఉన్న చున్నీని గట్టిగా గొంతుకు చుట్టేసి ఊపిరాడకుండా చేశాడు. దీంతో ఆ చిన్నారి అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. పాకిస్థాన్‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌నకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే... ఎమాన్‌ తన్వీర్‌ తొమ్మిదేళ్ల బాలిక, అబ్దుల్‌ రహ్మాన్ అనే 11 ఏళ్ల బాలుడు అన్నాచెల్లెళ్లు. ఇటీవ‌ల వీరు త‌మ‌ అమ్మమ్మ ఇంటికి వ‌చ్చారు.

వారిద్దరు ఇంట్లో చేతిరాత పోటీలు పెట్టుకోగా, అబ్దుల్‌ చేతిరాత బాగోలేదని అత‌డి చెల్లి వెక్కిరించింది. దీంతో అవమానంగా భావించిన ఆ బాలుడు ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. అనంత‌రం తాను కూడా మణికట్టును కోసుకొని తలుపులేసుకుని ఓ క‌ట్టుక‌థ అల్లాడు. అయితే, దర్యాప్తు చేసిన పోలీసులు ఆ బాలుడే ఈ ప‌నిచేశాడ‌ని గుర్తించారు. చివరికి తన చెల్లిని తానే చంపిన‌ట్లు ఆ బాలుడు అంగీక‌రించాడు.         

  • Loading...

More Telugu News