: సమాధిలో బతికున్న చిన్నారి.. గుర్తించి కాపాడిన స్థానికులు!


మధ్యప్రదేశ్‌ బిర్వాని జిల్లాలోని ఓ గ్రామంలో అంద‌రూ నిర్ఘాంత‌పోయే ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని మైదానంలో ఓ ప‌సికందును పాతిపెట్టారు. అయితే, పిల్లలు ఆ మైదానంలో ఆడుకుంటుండగా చిన్నారి ఏడుపు వినిపించ‌డంతో ఈ విష‌యాన్ని స్థానికుల‌కు తెలియ‌జేశారు. దీంతో ఆ పసికందును పూడ్చిపెట్టిన చోటుకి వెళ్లి ఆ బిడ్డ‌ను బ‌య‌ట‌కు తీసిన గ్రామ‌స్తులు ఇంకా బ‌తికే ఉన్నాడ‌ని తెలుసుకుని ఆశ్చ‌ర్య‌పోయారు. ఆ బిడ్డ‌ను గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు నాలుగు గంట‌ల క్రితం అక్క‌డ పూడ్చిపెట్టి వెళ్లార‌ని చెప్పారు.

సునీత అనే యువతి ఆ పసికందుకు స్థానిక హాస్పిటల్‌లో చికిత్స చేయించింది. ఆ ప‌సివాడి పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. తనకి ముగ్గురు కూతుళ్లు పుట్టారని, ఈ మ‌గ‌బిడ్డ‌ను తన‌కు ఆ దేవుడే ఇచ్చాడ‌ని, అపురూపంగా పెంచుకుంటాన‌ని సునీత చెప్పింది. ఆ బిడ్డ‌కు 10 రోజులు కూడా నిండలేద‌ని వైద్యులు చెప్పారు. సమాధిలోంచి ఆ బిడ్డ ప్రాణాల‌తో బయటపడటం పట్ల వైద్యులు సైతం ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు.       

  • Loading...

More Telugu News