: ఇజ్రాయెల్ లో మోదీకి ఘనస్వాగతం... స్వయంగా స్వాగతం పలికిన ఇజ్రాయెల్ ప్రధాని.. మీరూ చూడండి!


భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి ఇజ్రాయెల్‌లో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయం చేరుకున్న మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికారు. ఓ భారత ప్రధాని ఇజ్రాయెల్‌లో తొలిసారి పర్యటిస్తుండడంతో ఇజ్రాయెల్ ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న ప‌ట్ల ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు.

కాగా, మోదీ ఆ దేశంలో మూడు రోజుల పాటు ప‌ర్య‌టించనున్నారు. ఈ మూడు రోజులూ ఇజ్రాయెల్ ప్ర‌ధాని మోదీ వెంటే ఉండనున్నట్లు స‌మాచారం. మోదీ పర్య‌ట‌న‌లో ముఖ్యంగా ఇరు దేశాల‌ ర‌క్ష‌ణ, భ‌ద్ర‌త అంశాల‌పై చ‌ర్చలు జ‌ర‌గ‌నున్నాయి. నీరు, వ్య‌వ‌సాయం మొద‌లైన అంశాల‌పై ప‌లు ఒప్పందాలు జ‌ర‌గ‌నున్నాయి.    

  • Loading...

More Telugu News