: కోళ్లతో వెళుతున్న లారీ బోల్తా... రోడ్డుపై పడ్డ ఏడువేల కోళ్లు.. భారీగా ట్రాఫిక్‌ జామ్!


ప్రధాన రహదారిపై కోళ్లలోడుతో వెళుతున్న లారీ ఒక్క‌సారిగా అదుపుత‌ప్పి ప‌డిపోయిన ఘ‌ట‌న ఆస్ట్రియాలోని లింజ్ వద్ద చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదస్థ‌లి దేశ రాజధానిని కలిపే రహదారి కావ‌డంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘ‌ట‌న‌తో అందులోని వేలాది కోళ్లలో కొన్ని మృతి చెంద‌గా, మరికొన్ని రోడ్డుపైకి ఎగిరిప‌డ్డాయి. సుమారు 160 మీటర్ల వెడల్పు ఉన్న ఆ రోడ్డు కోళ్లతో నిండిపోవ‌డంతో ఎక్క‌డి వాహ‌నాలు అక్క‌డే నిలిచిపోయాయి. రోడ్డుపై మొత్తం ఏడువేల కోళ్లు ఉన్నాయ‌ని అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు కోళ్లను పక్కకు తప్పించి, వాహనాలు ముందుకు వెళ్లేలా చేశారు.          

  • Loading...

More Telugu News