: ‘పెళ్లి చూపులు’ చిత్ర బృందానికి కంగ్రాట్స్ : హీరోయిన్ రీతూ వర్మ
గత ఏడాది విడుదలైన ‘పెళ్లి చూపులు’ చిత్రం జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగాను, ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రంగాను అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా, సైమా (సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) -2017లో మూడు అవార్డులను ఈ చిత్రం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర కథానాయిక రీతూ వర్మ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేసింది. ‘సైమా’లో మూడు అవార్డులను సొంతం చేసుకున్న చిత్ర బృందానికి కంగ్రాట్స్..’ అని పేర్కొంది. కాగా, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ కమెడియన్, బెస్ట్ ఫిల్మ్ గా ఈ చిత్రానికి మూడు అవార్డులు దక్కాయి. కాగా, జూన్ 30, జులై 1 తేదీల్లో ఈ అవార్డుల వేడుక కార్యక్రమం అబుదాబిలో నిర్వహించారు.