: మరి కాస్త పడిన బంగారం ధర.. భారీగా తగ్గిన వెండి ధర
మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. నిన్న కాస్త తగ్గిన బంగారం ధర ఈ రోజు కూడా అదే బాటలో పయనించింది. 10 గ్రాముల పసిడి ధర ఈ రోజు మరో రూ.90లు క్షీణించి రూ. 29,310గా నమోదైంది. మరోవైపు డాలర్ విలువ పెరగడం, డిమాండ్ తగ్గడంతో వెండి ధర కూడా ఏకంగా వెయ్యి రూపాయలకు పైగా తగ్గిపోయింది. ఢిల్లీలో కిలో వెండిధర ఈ రోజు రూ.1,335 తగ్గి రూ.38,265గా నమోదైంది. గ్లోబల్ మార్కెట్‌లో కొనసాగుతున్న ప్రతికూల సంకేతాలు, దేశీయ మార్కెట్లో నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో వెండి ధర పడిపోయిందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వెండి ధరలు 2.98 శాతం తగ్గి ఔన్స్ ధర 16.11 డాలర్లకు చేరుకోగా, ఔన్స్ పసిడి 1.73 శాతం నష్టపోయి 1,219.70 డాలర్లకు చేరుకుంది.