: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ లేకుండా ఉంటే బాగుండేది: వెంకయ్య నాయుడు
రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ లేకుండా ఉంటే బాగుండేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ఏపీ పర్యటన సందర్భంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... అన్ని పార్టీలతో మాట్లాడాలని బీజేపీ ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసిందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలపై అన్ని పార్టీలను సంప్రదించామని, చివరకు తాము తమ అభ్యర్థిని ప్రకటించగానే ఎన్డీయేతర పార్టీలు కూడా రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు పలికాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు ముందుగా చొరవ తీసుకుని ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు పలికారని ఆయన అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీల సిద్ధాంతాలకు తావు లేదని చెప్పారు.