: ఆ నేతలు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు: సీఎం చంద్రబాబు


కొందరు నేతలు పనిచేస్తుంటే, మరికొందరు నేతలు పనిచేయడం లేదని.. ఇంకొందరు నేతలు అసలు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో నిర్వహించిన టీడీపీ వర్క్ షాప్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జీఎస్టీపై నేతలకు  మంత్రి యనమల రామకృష్ణుడు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, జన్మభూమి కమిటీల ద్వారా గ్రామీణ గృహ నిర్మాణ లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని, కిందిస్థాయి నేతలపై అవినీతి ఆరోపణలు ఎక్కువవుతున్నాయని, అవినీతిని నియంత్రించేలా నేతలు పనిచేయాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News