: ఎయిర్ పోర్టులో రామ్‌నాథ్ కోవింద్ కు ఎదురెళ్లి స్వాగతం పలికిన చంద్రబాబు
తన హైదరాబాద్ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిలతో వేర్వేరుగా సమావేశాల్లో పాల్గొన్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ అక్కడి నుంచి బయలుదేరి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎదురెళ్లి స్వాగతం పలికారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా విమానాశ్రయ ప్రాంతానికి భారీగా చేరుకుని ఆయనకు సాదరస్వాగతం పలికారు. అనంతరం రామ్‌నాథ్ కోవింద్ చంద్రబాబు నాయుడితో కలిసి ఏ కన్వెన్షన్ సెంటర్‌కు బయలుదేరారు.