: ‘రేపు అక్కడ కలుద్దాం’ అంటూ అభిమానులకు ట్వీట్ చేసిన సమంత, అక్కినేని అఖిల్
‘రేపు అక్కడ కలుద్దాం’ అంటూ చెన్నై బ్యూటీ సమంత తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులకు తెలిపింది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సమంత ప్రస్తుతం పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. సినిమాల్లోనే కాక పలు షాపింగ్ మాళ్ల ప్రారంభోత్సవ వేడుకలకు కూడా హాజరవుతోంది. ఇటీవలే హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు... రేపు కరీంనగర్ పట్టణంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొననుంది. ఈ విషయాన్నే తెలుపుతూ సమంత ఈ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌కు సమాధానంగా ఆమె అభిమానులు ‘నీ కోసం అక్కడకు తప్పకుండా వస్తాం సమంత’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, అక్కినేని అఖిల్ కూడా ఇందుకు సంబంధించి ట్వీట్ చేశాడు. తాను కూడా రేపు ఆ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొంటానని చెప్పాడు. రేపు అక్కడ కలుద్దాం అని పేర్కొన్నాడు.