: బాలకృష్ణ హీరో అయితే ఆ సినిమాకు న్యాయం జరగదు!: లక్ష్మీపార్వతి


తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవితాన్ని వర్మ సమర్థంగా తెరకెక్కిస్తారనే నమ్మకం తనకు లేదని, బాలకృష్ణ హీరో అయితే మాత్రం ఆ సినిమాకు న్యాయం జరగదని వ్యాఖ్యానించారు.

రక్తచరిత్ర సినిమాలో హత్యలను ప్రోత్సహించిన వ్యక్తిగా ఎన్టీఆర్ ను చూపించారని, మరి, ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కించనున్న చిత్రంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా వైస్రాయ్ సంఘటనల్ని వర్మ చూపించగలడా? అని ప్రశ్నించారు. చివరిరోజుల్లో ఎన్టీఆర్ అనుభవించిన క్షోభ, మాటల్ని సినిమాలో చూపించాలని ఆమె డిమాండ్ చేశారు.  

  • Loading...

More Telugu News