: కోవింద్ కు వెండి చార్మినార్ ప్రతిమను బహూకరించిన కేసీఆర్
ఈ మధ్యాహ్నం హైదరాబాదు, జలవిహార్ లో టీఆర్ఎస్ నేతలతో సమావేశమై, తనకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు చెప్పిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ ను సీఎం కేసీఆర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమం పూర్తయిన తరువాత, మన ఇంటికి వచ్చిన అతిథులను గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉందని చెబుతూ, ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఆపై వెండితో తయారు చేసిన చార్మినార్ ప్రతిమను బహూకరించారు. ఆపై కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ తదితరులకు శాలువాలు కప్పి సత్కరించారు.