: కోవింద్ కు శాలువా కప్పి, సత్కరించిన జగన్


ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నేడు హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల అధినేతలు, నేతలను ఆయన కలిశారు. నగరంలోని పార్క్ హయత్ హోటల్ లో బస చేసిన కోవింద్ తో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఉన్నారు. ఈ భేటీకి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ అధికార ప్రతినిధి మురళీధర్ రావులు హాజరయ్యారు. భేటీ సందర్భంగా కోవింద్ కు శాలువా కప్పి జగన్ సత్కరించారు. పార్టీ నేతలను ఆయనకు పరిచయం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ మద్దతు మీకేనని జగన్ తెలిపారు. 

  • Loading...

More Telugu News