: పీకల్లోతు ప్రేమలో ఉందనే వార్తలపై స్పందించిన శ్రుతి హాసన్!


విలక్షణ నటుడు కమలహాసన్ ముద్దుల తనయ శ్రుతి హాసన్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతోందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. లండన్ కు చెందిన థియేటర్ యాక్టర్ మైఖేల్ కోర్సేల్ తో ప్రేమలో ఉన్నట్టు గత కొన్ని నెలలుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఇటీవల లండన్ నుంచి ముంబైకి వస్తూ తనతో పాటు మైఖేల్ ను కూడా వెంటపెట్టుకొచ్చింది శ్రుతి. దీంతో, ఈ ప్రేమ వార్తలకు మరింత ఊతమిచ్చినట్టైంది.

 ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో శ్రుతి స్పందిస్తూ, తన వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడనని చెప్పింది. తన జీవితంలో వంద విషయాలపై ప్రేమలో ఉన్నానని... అవన్నీ తనకు అమూల్యమైనవని తెలిపింది. ఎవరి జీవితంలోనైనా వారి జీవిత భాగస్వాములదే కీలక పాత్ర అని... కాబట్టి ఇలాంటి విషయాలను అందరితో పంచుకోవడం అర్థంలేని విషయమని చెబుతూ... అసలైన సమాధానాన్ని దాటవేసింది. 

  • Loading...

More Telugu News