: కోరిక తీర్చాలని వేధిస్తున్నాడంటూ, సర్పంచ్ భర్తను చెప్పుతో కొట్టిన అంగన్ వాడీ టీచర్
"నీకు అంగన్ వాడీ టీచర్ గా ఉద్యోగం ఇప్పించాను. నా సంగతి ఎప్పుడు చూస్తావు?" అంటూ పెద్దపల్లి మండలం మూలసాల సర్పంచ్ భర్త కొమరయ్య, లైంగిక వేధింపులకు గురి చేస్తుంటే, తాను చెప్పుతో కొట్టానని చెబుతూ, పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిందో బాధితురాలు. తన కోరిక తీర్చాల్సిందేనని వెంటపడుతుంటే, తట్టుకోలేక తానే కొట్టానని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.
అయితే, అంగన్ వాడీ సెంటరును తాను పాఠశాలలోకి మార్పించినందునే తమ ఆటలు సాగవన్న భయంతో ఆమె ఈ విధమైన దుష్ప్రచారం చేస్తున్నదని కొమరయ్య ఆరోపించగా, చెప్పు దెబ్బల విషయం బయటకు పొక్కిన తరువాత, గ్రామ పెద్దలు ఇద్దరి మధ్యా రాజీ కుదర్చారని సమాచారం. ఆపై బాధితురాలు మరోసారి స్టేషన్ కు వెళ్లి తన ఫిర్యాదును వెనక్కు తీసుకుందని తెలుస్తోంది.