: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు దళితుల బహుమతి... 125 కిలోల సబ్బు!


మే 30న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కుషీనగర్ సమీపంలోని ముస్హర్ గ్రామంలో దళితులను కలిసేందుకు ప్రత్యేకంగా పర్యటించిన వేళ, సీఎం వద్దకు అనుమతించే దళితులకు ప్రత్యేకంగా సబ్బులు ఇచ్చి, శుభ్రంగా స్నానం చేసి రావాలని అధికారులు కోరినట్టు వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. తమను కలిసేందుకు వస్తూ, యోగి ఆదిత్యనాథ్ సబ్బులను పంపడాన్ని నిరసిస్తూ, 125 కిలోల బరువైన భారీ సబ్బును ఆయనకు బహుమతిగా పంపాలని నిర్ణయించారు.

 దళిత హక్కుల పరిరక్షణ పోరాట సమితి ఈ కార్యక్రమాన్ని చేపట్టి, సమితిలో సభ్యత్వం ఉన్న సుమారు 1000 మంది మహిళల నుంచి 10 రూపాయల చొప్పున వసూలు చేసి, 10 రోజుల్లో 125 కిలోల సబ్బును తయారు చేసింది. దళితులను యూపీ సర్కారు ఘోరంగా అవమానిస్తున్నందునే తాము నిరసన తెలిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సమితి నేత నట్టూ పరమార్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News