: బాలకృష్ణకు ఫుడ్ పాయిజన్... చికిత్స పొందుతున్నారన్న పూరీ జగన్నాథ్
హీరో బాలకృష్ణ ఫుడ్ పాయిజన్ అయి బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని దర్శకుడు పూరీ జగన్నాథ్ వెల్లడించారు. 'శమంతకమణి' సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ పాల్గొనాల్సి వుండగా, ఆయన రాలేదు. దీనికి కారణాన్ని పూరీ వెల్లడిస్తూ, 'పైసా వసూల్' చిత్రం షూటింగుకు ప్యాకప్ చెప్పిన సమయంలోనూ సాయంత్రం 'శమంతకమణి' ఫంక్షన్ లో కలుద్దామని బాలయ్య చెప్పారని గుర్తు చేసుకున్నాడు. అయితే, ఆరోగ్యం బాగాలేక ఆయన బయటకు రాలేకపోయారని, అభిమానులకు 'సారీ' చెప్పాలని తనను కోరారని అన్నాడు. ఇక త్వరలో జరిగే 'పైసా వసూల్' ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకల్లో అభిమానులు బాలయ్యను చూడవచ్చని అన్నాడు.