: ముత్తూట్ ఫైనాన్స్ లో దోపిడీకి ప్రయత్నం... మేనేజర్ అప్రమత్తత.. పరుగులు పెట్టిన దొంగలు!
హైదరాబాదులోని మైలార్ దేవ్ పల్లి ముత్తూట్ ఫైనాన్స్ లో జరగాల్సిన భారీ దోపిడీ మేనేజర్ అప్రమత్తత వల్ల తప్పిపోయింది. అక్కడి ముత్తూట్ ఫైనాన్స్ బ్రాంచ్ లో ఆరుగురు దుండగులు ప్రవేశించారు. కత్తులు, తుపాకులు చూపించి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో అప్రమత్తమైన మేనేజర్ అలారం నొక్కాడు. దీంతో స్థానికులు అక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. దీనిని చూసిన దుండుగులు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు, దుండుగులను పట్టుకునేందుకు వేట ప్రారంభించారు.