: నోట్ల మార్పిడికి మరోసారి గడువు ఎందుకు ఇవ్వలేదు?: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నోట్ల రద్దుపై సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. పాత నోట్ల మార్పిడికి మరోసారి గడువు ఎందుకు ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి రెండు వారాల్లోగా సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు, ఆర్బీఐకి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చూడాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.