: నాకు వాసన కూడా పడదు...నేనెందుకు బీర్ ను ప్రమోట్ చేస్తాను?: మంత్రి జవహర్
ప్రమాదకరమైన మద్యం అలవాటు నుంచి ప్రజలను దూరం చేసేందుకు బీర్ హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తామని అన్నానని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ తెలిపారు. బీర్ హెల్త్ డ్రింక్ అన్న వ్యాఖ్యలపై దుమారం రేగడంతో ఆయన మాట్లాడుతూ, బీరు హెల్త్ డ్రింక్ అని తాను అనలేదన్నారు. బీరులో ఆల్కహాల్ శాతాన్ని తగ్గించి, హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేస్తామని చెప్పారు. బీరుతోపాటు, తాటి కల్లు, ఈత కల్లును కూడా ప్రమోట్ చేస్తామని ఆయన చెప్పారు. ప్రమాదకర మద్యాన్ని మాన్పించే క్రమంలో పలు చర్యలు చేపట్టామని, అందుకోసం నూతన గీత కార్మిక పాలసీని తీసుకురానున్నామని ఆయన చెప్పారు. తనకు మద్యం వాసనే పడదని, తానెందుకు బీర్ ను ప్రమోట్ చేస్తానని ఆయన ప్రశ్నించారు.