: ఈ గున్నఏనుగు చాలా తుంటరిది సుమండీ!
రెండేళ్ల క్రితం చైనాలోని ఓ అడవిలో తీవ్రగాయాలతో పడి ఉన్న గున్నఏనుగును స్థానికులు చూశారు. వెంటనే దగ్గర్లోని రెస్క్యూ సెంటర్ కు ఫోన్ చేసి దాని గురించి వివరించారు. దీంతో వారు వెళ్లి ఏనుగును రెస్క్యూ సెంటర్ కు తీసుకొచ్చి చికిత్స చేశారు. అనంతరం దానికి యాంగ్ నియు అని పేరుపెట్టి బంతాట ఆడడం, గంతులేయడం వంటివి నేర్పించారు. దీంతో ఈ గున్న ఏనుగు చాలా తుంటరిదైపోయింది. జారుడుబల్ల ఆట ఆడుతుంది. బురదలో జారుకుంటూ ఎత్తునుంచి నీటిలోకి వెళ్తుంది. రెస్క్యూ సెంటర్ కు తీసుకొచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా దానికి సంబంధించిన ఒక వీడియోను రూపొందించి ఇంటర్నెట్ లో పెట్టగా, అది వైరల్ గా మారింది. ఆ వీడియో మీరు కూడా చూడండి.