: అప్పుడే ఎన్టీఆర్ పై సొంత గొంతుతో ఓ పాట కూడా పాడేసిన రాంగోపాల్ వర్మ... క్యాచీగా ఉన్న లిరిక్స్ ఇవే!


బాలకృష్ణ హీరోగా, దివంగత ఎన్టీ రామారావు జీవిత చరిత్రను తెరపైకి ఎక్కించనున్నామని ఇలా ప్రకటించాడో లేదో... వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ, అప్పుడే ఓ పాటను కూడా రికార్డు చేసేశాడు. స్వయంగా ఆయన పాడిన పాటను విడుదల చేశాడు కూడా. "జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్..." అంటూ ఈ పాట సాగుతుంది. "ఇదే తెలుగు కీర్తి, ఇదే తెలుగు ఖ్యాతి, పొంగించారు మీరే ఈ తెలుగోడి ఛాతీ... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... అన్యాయాన్ని తుంచి, అధర్మాన్ని వంచి, పాలించారు మీరే సదా ప్రేమ పంచి... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... మీరే జీవితం, మీరే శాశ్వతం, ఇక ఏనాటికైనా మీదే సంతకం... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... మీదే రాజసం, మీదే సాహసం, తెలుగోడికిచ్చారు పొంగే పౌరుషం. జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్... జై ఎన్టీఆర్..." అంటూ సాగే పాట ఇప్పుడు శరవేగంగా పాప్యులర్ అయిపోతోంది. పాటలోని లిరిక్స్ క్యాచీగా ఉండటం విశేషం.

  • Loading...

More Telugu News