: దంగల్ కి 2000 కోట్లు రాలేదు: అమీర్ ఖాన్ ప్రతినిధి ప్రకటన
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా అద్భుతమైన విజయంతో పాటు భారతీయ సినీ పరిశ్రమ అత్యధిక వసూళ్ల రికార్డులన్నీ తుడిచి పెట్టేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ మేగజీన్ ఫోర్బ్స్ కూడా 2,000 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన భారతీయ సినిమా అంటూ దంగల్ ను ప్రశంసించింది. ఈ నేపథ్యంలో అమీర్ ఖాన్ ప్రతినిధి దంగల్ సినిమా ఇంకా 2,000 కోట్ల క్లబ్ లో చేరలేదని అన్నాడు. చైనాలో విడుదలైన దంగల్ అద్భుత విజయం సాధించిందని, చైనాలో 2,000 కోట్లు రాబట్టిందని వార్తలు వెలువడుతున్నాయి. కానీ గత గురువారానికి దంగల్ 1,864 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే రాబట్టిందని ఆయన చెప్పాడు.