: బీహార్ సీఎం కార్యక్రమంలో 'క్యాండీ క్రష్' ఆడుకున్న పోలీసులకు నోటీసులు


బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాష్ట్రంలో డ్రగ్స్ స్మగ్లింగ్ ను నిరోధించడమెలా? అనే అంశంపై పాట్నాలో కీలకమైన సెమినార్ ను నిర్వహిస్తున్న వేళ, 'క్యాండీ క్రష్ సాగా' ఆడుకుంటూ మీడియా కెమెరాలకు చిక్కిన పోలీసు అధికారులకు ప్రభుత్వం నోటీసులు పంపింది. పోలీసు ఉన్నతాధికారులే ఇలా చేస్తారని తాము భావించలేదని అదనపు డైరెక్టర్ జనరల్ ఎస్కే సింఘాల్ వ్యాఖ్యానించారు. వారిపై చర్యలు తీసుకునే ముందు వారి వాదన వినే అవకాశం ఇవ్వాలని భావించి, నోటీసులు పంపినట్టు స్పష్టం చేశారు. వారికి కౌన్సెలింగ్ ఇవ్వనున్నామని తెలిపారు. కాగా, ఈ సదస్సు జరుగుతున్న వేళ పలువురు తమ స్మార్ట్ ఫోన్లను తీసి, వారి పనుల్లో నిమగ్నమై, ప్రసంగాలను పక్కన బెట్టారని వచ్చిన వార్తలు కలకలం రేపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News