: ఆదిలాబాద్ అడవుల్లో గ్రహాంతర వాసులు.. పుకార్ల షికారు!
ఆదిలాబాద్ జిల్లా జిన్నారం అడవుల్లో గ్రహాంతర వాసులు సంచరిస్తున్నారనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. గొర్రెలను ఏలియన్స్ చంపుకుతింటున్నాయనే వదంతులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారమవుతున్నాయి. అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ఏలియన్స్ ఫొటోలు దొరికాయంటూ కొన్ని ఫొటోలను కూడా షేర్ చేస్తున్నారు. అంతేకాదు, ఫొటోల్లో అతి పెద్ద పాదం కూడా లభించిందనే ప్రచారం ఊపందుకుంది. రెండు కొమ్ములు, పెద్ద చేతులు, కాళ్లు, పెద్ద గోర్లు ఉన్న ఫొటో వైరల్ అవుతోంది.
అయితే, ఈ ఫొటోలు ఒరిజినల్ కాదని... గ్రాఫిక్స్ అని చాలా మంది కొట్టి పారేస్తున్నారు. గ్రహాంతవాసుల ఉనికికి సంబంధించి ప్రపంచంలో ఇంకా ఎక్కడా ఆధారాలు లభించలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.