: ఏపీలో కలకలం రేపిన ఎక్సైజ్ మినిస్టర్ వ్యాఖ్యలు.... బీరు హెల్త్ డ్రింకా?: ఆశ్చర్యపోతున్న వైద్యులు!


ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ చేసిన వ్యాఖ్యలు పెను కలకలం రేపుతున్నాయి. మరోవైపు ఆయన బీరును హెల్త్ పానీయం అంటూ పేర్కొనడంపై వైద్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ నూతన మద్యం పాలసీని ప్రవేశపెడుతూ...బీరును సంప్రదాయ హెల్త్ డ్రింక్ అనేలా ప్రచారం చేస్తామని తెలిపారు. దీనిపై వివిధ వర్గాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లైట్ బీర్ లో 5%, స్ట్రాంగ్ బీర్ లో 8% ఆల్కహాల్ ఉంటుందని, అటువంటప్పుడు అది ఎలా హెల్త్ డ్రింక్ అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

 బీరు వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయని, బెల్లీ ఫాట్ పెరుగుతుందని, బీర్ ఆరోగ్యకర పానీయం అని ఎవరు చెప్పారని వైద్యులు ప్రశ్నిస్తుండగా....అసలు బీర్ బాటిల్ పై ఆరోగ్యానికి హానికరం అని ఎందుకు ముద్రించి ఉంటుందోనన్న సంగతైనా మంత్రికి తెలుసా? అంటూ పలువురు ఎద్దేవా చేస్తున్నారు. మంత్రి తక్షణం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇలాగే ఊరుకుంటే ఉదయాన్నే కల్లు తాగాలని, మధ్యాహ్నం బీరు తాగాలని, రాత్రి మద్యం తాగాలని, అన్నీ ఆరోగ్యకరమేనని అధికార పార్టీ నేతలు చెబుతారని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News